నమస్తే,
నా వెబ్ సైట్ కి స్వాగతం...
నా పేరు కృష్ణ మోహన్ దెందుకూరి... నేను గత 25 ఏళ్లకు పైగా షేర్డ్ సర్వీసెస్ ఇండస్ట్రీ లో ఫైనాన్స్ అనలిస్ట్ గా పనిచేస్తున్నాను...
ఈ మధ్యనే తెలుగు లో వెబ్ సిరీస్... లేదా... సినిమా కి సరిపడేలా కథలు రాయడం మొదలు పెట్టాను... ఇప్పటికే మూడు కథలు పూర్తి చేశాను... నాలుగో కథకి మెటీరియల్ కలెక్షన్ నడుస్తోంది... ...
నా మొదటి కథ.... ఆపరేషన్ బూమెరాంగ్.... ఒక స్వలాభం కోసం దేనికైనా సిద్దపడే ఒక రాజకీయ నాయకుడు సంఘం లో ఒక పెద్ద మనిషి కి చెందిన ఆస్తిని చేజిక్కించుకోవడానికి చేసిన అకృత్యాలు... చివరికి ఆ రాజకీయ నాయకుడికి పట్టిన గతి ని వివరించడం జరిగింది...
రెండో కథ... ఆపరేషన్ క్రాస్ ఫైర్... సంఘం లో పెద్ద మనుషులు గా చలామణి అవుతున్న నలుగురు వ్యక్తుల పిల్లలు చేసిన ఘాతక చర్య కారణంగా జరిగిన సంఘటనలు... ఆ నలుగురు ఘరానా వ్యక్తుల పతనానికి ఎలా కారణం అయ్యింది.... నేషనల్ సెక్యూరిటీ... ఇంటెలిజెన్స్ బ్యూరో... రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన ఏజెంట్స్ దేశం లో అతి పెద్ద డ్రగ్ మాఫియా ని ఎలా నాశనం చేశారు అన్నది వ్రాయడం జరిగింది...
మూడో కథ... ఒక వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవటానికి చేసిన ప్రయత్నం అనుకోకుండా భారత దేశం లో జరగబోయే మారణకాండ గురించి ఎలా తెలుసుకుంటాడు... రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్... ఇంటెలిజెన్స్ బ్యూరో... ఇండియన్ ఆర్మీ... సహాయంతో ఆ ప్రమాదాన్ని ఎలా ఆపుతారు అన్నది ఈ కథ సారాంశం.
ఈ కథలు మీకు తప్పకుండా నచ్చుతాయని నా నమ్మకం
భవదీయుడు... కృష్ణ మోహన్